భారతదేశం, డిసెంబర్ 2 -- ఇండియన్ ఐడల్ 12 విజేత పవన్‌దీప్ రాజన్ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు, కుడి చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు చేసిన తర్వాత కోలుకున్న పవన్‌దీప్.. తాజాగా సలీం-సులేమాన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ కష్టకాలాన్ని ఒక పాఠంగా ఎలా మలుచుకున్నాడో వివరించాడు.

ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ పవన్‌దీప్ భావోద్వేగానికి లోనయ్యాడు. "మొదట్లో మాకు ఎవరూ సహాయం చేయలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. అప్పటికే కారులో మంటలు చెలరేగాయి. నేను ఆ మంటల్లో చిక్కుకున్న కారు లోపలే ఉన్నాను. వాళ్ళలో ఒకరు నన్ను బయటకు లాగారు" అని పవన్‌ద...