Hyderabad, ఏప్రిల్ 28 -- కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ లవ్, యాక్షన్, కామెండీ చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో మూవీలో సూర్యకు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో సినిమా నిర్మించారు.

రెట్రో మూవీ మే 1న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రెట్రో సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇక రీసెంట్‌గా అంటే ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్కీ భాస్కర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అ...