Hyderabad, ఆగస్టు 3 -- బ్యూటిపుల్ తమన్నా హీరోయిన్‌గానే కాకుండా పలు ఐటమ్ సాంగ్స్‌తో కూడా ఎంతగానో మెప్పించింది. తెలుగు, హిందీ భాషల్లో ఐటమ్ సాంగ్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక, సాంగ్స్ గురించి మాట్లాడింది.

తాను చేసే సినిమాలు, సాంగ్స్ ప్రేక్షకుల జీవితాలపై ప్రభావం చూపేలా లేదా ప్రభావితం చేసేలా ఉండాలని చెప్పింది తమన్నా భాటియా. లల్లాంటాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన ప్రాజెక్టులు కేవలం జీవనోపాధి కోసం చేసేవి మాత్రమే కాదని తెలిపింది.

"ఓ పిల్లాడు తింటూ నా సాంగ్‌ను చూస్తే.. అలాగే చూడనివ్వండి" అని తమన్నా చెప్పింది. దాంతో ఇంటర్వ్యూ నిర్వహించిన హోస్ట్ "మీరు ఏ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు" అని అడగ్గా.. స్త్రీ 2 మూవీలో తాను చేసిన ఐటమ్ సాంగ్ "ఆజ్ కీ రాత్" అని తమన్నా భాటియా బదులు ఇచ్చి...