భారతదేశం, జనవరి 13 -- టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు మరో మూవీతో ఈ సంవత్సరం సంక్రాంతికి రానుంది. ఆ సినిమానే అనగనగా ఒక రాజు.

టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా చేసిన అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. మారి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 12న సాయంత్రం వరంగల్‌ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు...