Hyderabad, జూన్ 16 -- బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన 2014లో వచ్చిన మూవీ 'పీకే' విడుదల సమయంలో చెలరేగిన 'లవ్ జిహాద్' ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించాడు. 'ఆప్ కీ అదాలత్'లో జరిగిన ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. ఆ సినిమా ద్వారా ఏ మతాన్ని అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తన అక్కచెల్లెళ్లు, కూతురు హిందువులను పెళ్లి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అన్ని మతాంతర వివాహాలను 'లవ్ జిహాద్' అని పిలవలేమని స్పష్టం చేశాడు.

2014లో వచ్చిన పీకే మూవీ అప్పట్లో ఓ సంచలనం. దేవుడి పేరుతో మోసం చేసే వ్యక్తులను ఓ ఏలియన్ గా భూమి మీదికి వచ్చిన వ్యక్తి ఎలా బయటపెట్టాడన్నదే ఈ మూవీ స్టోరీ. అయితే ఇందులో హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయని, ఇదో లవ్ జిహాద్ అన్న విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమిర్ ఖాన్ స్పందించాడు....