భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలం అప్పన్న ఆలయ చందనోత్సవం సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాత్రి రెండున్నరకు గోడ కూలడంతో ఎనిమిదిమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మంగళవారం రాత్రి నుంచి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం బారులు తీరారు. ఉచిత క్యూ లైన్లతో పాటు రూ.300 రుపాయల దర్శనం లైన్లలో కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి ఒంటిగంటకు స్వామి వారికి మేల్కొలుపుతో పూజలు మొదలయ్యాయి.

మంగళవారం రాత్రి సింహాచలం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో కొండలు తడిచి ముద్దయ్యాయి. సింహాచలం ఆలయ మెట్ల మార్గం వెంబడి ఉన్న ప్రదేశంలో రూ.300 దర్శనం టిక్కెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు. మెట్లకు దన్నుగా రిటైనింగ్‌ వాల్ నిర్మి...