Hyderabad, సెప్టెంబర్ 25 -- బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కు చిరంజీవి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పెద్దలు ఆయనను కలవడానికి వెళ్లడం, అప్పుడు తనను పిలవలేదని బాలకృష్ట అనడం, అంతేకాదు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చాడన్న దాంట్లో నిజం లేదని కూడా అనడంపై చిరు స్పందించాడు. తన వల్లే బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాకు కూడా టికెట్ల ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశాడు.

చిరంజీవి ప్రస్తుతం ఇండియాలో లేడు. దీంతో తాను ఇలా ఓ ప్రెస్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. అందులో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. ఆయన ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల...