భారతదేశం, ఏప్రిల్ 25 -- తెలంగాణలో నాలుగైదు రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు సెకండరీ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్‌ పంపింది. ముఖ్యమంత్రి అమోదం లభించిన తర్వాత పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి.

తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షల మార్కుల మెమోలపై కొంత సందిగ్ధం నెలకొంది. గ్రేడింగ్‌ విధానంపై స్పష్టత కొరవడటంత...