భారతదేశం, నవంబర్ 17 -- ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఒకటి స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ మూడో సీజన్ నాలుగేళ్ల తర్వాత ఈవారమే స్ట్రీమింగ్ కు రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ వారం ఓ మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వస్తోంది. 2021లో రెండో సీజన్ స్ట్రీమింగ్ కాగా.. సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ రాబోతోంది. ఈ శుక్రవారం (నవంబర్ 21) నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా కామెడీ, యాక్షన్ తో అదరగొట్టి అంచనాలు పెంచేసింది. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూడో సీజన్ కూడా తొలి రె...