భారతదేశం, జనవరి 20 -- "సక్త్ లౌండా"గా (Sakht Launda) యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టాండ్-అప్ కమెడియన్ జాకీర్ ఖాన్ తన అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. తన కామెడీ ప్రదర్శనలకు చాలా కాలం పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తన 'పాపా యార్' టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన షోలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని ఆడిటోరియం కిక్కిరిసి ఉండగా కమెడియన్ జాకీర్ ఖాన్ మైక్ పట్టుకుని ఎమోషనల్ అయ్యారు. "నా ఆరోగ్యాన్ని చూసుకోవడానికి, కొన్ని వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడానికి నేను 3, 4 లేదా 5 ఏళ్లు బ్రేక్ తీసుకుంటున్నాను. అంటే నేను మళ్లీ 2028, 2029 లేదా 2030లో తిరిగి రావచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ నాకు చాలా ప్రత్యేకం. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జ...