భారతదేశం, ఏప్రిల్ 15 -- దుబాయ్ కి పంపిస్తానని నమ్మబలికి నాలుగు లక్షలు రూపాయలు తీసుకొని, దుబాయ్ ఏజెంట్ మోసం చేయడంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ మండలంలోని తుర్కవాని కుంట గ్రామానికి చెందిన, బోడ శ్రీనివాస్ రెడ్డి (40) కి గ్రామంలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన భార్య, ఇద్దరు కూతుళ్లతో వ్యవసాయం, కూలినాలి చేసుకుంటూ జీవిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి, ఇటీవల వ్యవసాయంలో నష్టాలు రావడం వలన అప్పుల పాలయ్యాడు .

అప్పుల భారం నుండి ఎలాగైనా బయటపడాలని ఆలోచన చేసిన శ్రీనివాస్ రెడ్డి, కొన్ని సంవత్సరాలు దుబాయ్ లో పని చేసి తనకు ఉన్న అప్పులు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే తనకున్న ఎనిమిది లక్షల అప్పుతో పాటు, మరొక నాలుగు లక్షలు బంధువుల నుండి, స్నేహితుల నుండి అప్పు...