Andhrapradesh, జూన్ 12 -- వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్(కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం ఆదేశాలను జారీచేసింది.

వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు. మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఇదే విషయంతో పాటు రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది.

ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్...