భారతదేశం, నవంబర్ 20 -- వెర్సటైల్ యాక్ట‌ర్‌ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది ఈ సినిమా. ముఖ్యంగా మూవీలో కామెడీ బాగుందంటూ ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా మౌత్ ట...