భారతదేశం, జనవరి 1 -- దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైనప్పటి నుంచి సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

తాజాగా ఈ దురంధర్ చిత్రం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ఉన్న షారుఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ రికార్డును దురంధర్ సినిమా బద్దలు కొట్టింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ధురంధర్ నార్త్ అమెరికాలో నాలుగో మంగళవారం (డిసెంబర్ 30) నాటికి 17.50 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. గతంలో 'పఠాన్' సాధించిన 17.49 మిలియన్ డాలర్ల వసూళ్లను దురంధర్ దాటేసింది.

దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొ...