భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి పండగ ఆనందాన్ని డబుల్ చేస్తూ 'నారీ నారీ నడుమ మురారీ' మూవీ ఇవాళ సాయంత్రం రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా సాయంత్రం 5.49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ట్విటర్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం.

కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం శర్వానంద్ ప్రయత్నిస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే సినిమాలు అతనికి బాగానే సెట్ అవుతాయి. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ తో హిట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా ఉపయోగించాడు. నారీ నారీ నడుమ మురారీతో మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు.

గౌతమ్ (శర్వానం...