Telangana,khammam, జూలై 18 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ మంత్రి నారా లోకేష్ మధ్య రహస్య భేటీ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్.. అర్ధరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశారనే దానిపై కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ఆరోపణలను చేయడంతో రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై బీఆర్ఎస్, టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందించారు. ఇవాళ ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్ ను కలిశానంటూ ర...