భారతదేశం, జనవరి 14 -- నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా బసినికొండకు చెందిన పి.శివకుమార్ కోరారు.

తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని 'తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం' ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కచ్చరావేడులో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బి.శ్రీనివాసులు కోరారు. వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస...