భారతదేశం, డిసెంబర్ 28 -- వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. నాబార్డ్ తన 'యంగ్ ప్రొఫెషనల్' ప్రోగ్రామ్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ nabard.org ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12, 2026.

నియామక కాలపరిమితి: మొదట ఏడాది కాలానికి ఈ నియామకం ఉంటుంది. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి దీనిని గరిష్టంగా మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.

స్టైపెండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70,000 స్టైపెండ్ అందిస్తారు. అయితే, నిబంధనల ప్రకారం వర్తించే ఆదాయపు పన్ను (TDS) మినహాయించిన తర్వాతే ఈ మొత్తాన్న...