భారతదేశం, డిసెంబర్ 27 -- హీరోయిన్లపై అసభ్య పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ అందుకు తగిన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. శనివారం అతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. తన సమాధానం చెప్పుకొన్నాడు. ఆ తర్వాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కుట్ర చేశారన్నాడు. మరోవైపు శివాజీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగబాబు, ప్రకాష్ రాజ్ శివాజీని తప్పుపట్టారు.

దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్ల డ్రెస్ గురించి మాట్లాడుతూ 'సామాన్లు', 'దొంగ ము**' అనే పదాలు వాడాడు. అతని వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై తీవ్రమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీనిపై రియాక్టయింది. శివాజీకి నోటీసులు పంపించింది.

తన వ్యాఖ్యలపై శివాజీ ఇప్పటికే సారీ చెప్పాడు. మరోవైపు...