భారతదేశం, జూన్ 15 -- అమ్మ తొమ్మిది నెలల బిడ్డను కడుపులో మోస్తే.. తండ్రి జీవితాంతంం గుండెల్లో మోస్తాడు అని చెప్తారు. భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపించే నాన్న.. ఆ ప్రపంచాన్ని గెలిచేలా దిశగా నడిపిస్తాడు. నాన్న అంటేనే స్పెషల్ ఎమోషన్. తండ్రి అంటేనే మాటల్లో చెప్పలేని రిలేషన్ షిప్. నాన్న అయ్యాకే నాన్న గొప్పతనం తెలుస్తుందని అంటుంటారు. అది నిజమే. ఈ ఫాదర్స్ డే రోజు మీ నాన్నను సర్ ప్రైజ్ చేసేందుకు ఆ సాంగ్ పాడేయండి. యానిమల్ మూవీ నుంచి 'నాన్న నువ్వు నా ప్రాణం' సాంగ్ తెలుగు లిరిక్స్ మీ కోసం.

2023లో వచ్చిన యానిమల్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మొత్తం నాన్నపై ప్రేమతో సాగే కొడుకు చుట్టూనే ఉంటోంది. తండ్రిని చంపాలనుకునే వాళ్లను చంపే దాకా వదలని కొడుకు పాత్రలో రణ్ బీర్ కపూర్ అదరగొట్టాడు. ఈ మూవీలోని...