భారతదేశం, మే 31 -- చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్న యూత్ ను చూస్తున్నాం. కష్టమొస్తే చాలు తనువు చాలించే పిల్లలను చూస్తున్నాం. కానీ ఓ వైపు కఠిక పేదరికం ఉన్నా.. బయట నుంచి ఆటుపోటు మాటలు వినిపిస్తున్నా.. పరుగునే నమ్ముకుని, అథ్లెటిక్స్ నే శ్వాసగా భావించి సాగిన ఆ అమ్మాయి ఇప్పుడు ఛాంపియన్ గా నిలిచింది. ఆమెనే.. తెలంగాణ బిడ్డ అగసర నందిని. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో హెప్టాథ్లాన్ గోల్డ్ తో నందిని రికార్డు నమోదు చేసింది.

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని అదరగొట్టింది. హెప్టాథ్లాన్ లో విజేతగా నిలిచింది. 21 ఏళ్ల నందిని 5,941 పాయింట్లతో పర్సనల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో గోల్డ్ పట్టేసింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ హెప్టాథ్లాన్ లో సోమా బిస్వాస్ (2005), స్వప్న బర్మన్ (2017) తర్వ...