Hyderabad, సెప్టెంబర్ 15 -- మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం 'దక్ష - ది డెడ్‌లీ కాన్సిపిరసీ' (Daksha - The Deadly Conspiracy). ఈ సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా నటించిన దక్ష సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ దక్ష వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు మంచు లక్ష్మి కామెంట్స్ వైరల...