భారతదేశం, మే 10 -- అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో, మాస్ యాక్షన్ సీన్స్ తో గత్తరలేపారు హీరో నాని. మునుపెన్నడూ చూడని వైలెన్స్ ను చూపించారు. బీభత్సమైన రక్తపాతంతో, పీక్ యాక్షన్ మోడ్ లో 'హిట్ 3' మూవీలో రెచ్చిపోయారు నాని. ఈ నేచురల్ స్టార్ యాక్షన్ కు ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది.

మే 1న థియేటర్లకు వచ్చిన నాని 'హిట్ 3' మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీతో నాని వరుసగా రూ.100 కోట్ల సినిమా హీరోగా మారిపోయారు. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.105.85 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. తొమ్మిదో రోజైన శుక్రవారం (మే 9) ఈ మూవీకి రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

రూ.40.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో హిట్ 3 మ...