భారతదేశం, మే 14 -- హీరో నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది హిట్ 3 మూవీ. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. ఈ సూప‌ర్ హిట్ మూవీ త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

హిట్ 3 ఓటీటీ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత సినిమాను స్ట్రీమింగ్ చేసేలా నిర్మాత‌ల‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. ఈ డీల్ ప్ర‌కారం హిట్ 3 జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జూన్ ఫ‌స్ట్ వీక్‌లోనే ఓటీటీ విడుద‌ల తేదీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతోన్నారు.

హిట్ 3 మూవీకి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో నానికి ...