భారతదేశం, ఏప్రిల్ 20 -- తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 'రెట్రో' సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం మే 1వ తేదీన విడుదల కానుంది. తెలుగులోనూ రిలీజ్ అవనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు పూజా. ఈ క్రమంలో టాలీవుడ్‍లో ఇంకా ఏ హీరోతో కలిసి నటించాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె స్పందించారు.

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‍గా కొన్నేళ్లు కొనసాగారు పూజా హెగ్డే. అయితే, ఆచార్య తర్వాత తెలుగులో మళ్లీ హీరోయిన్‍గా చేయలేదు. గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న తర్వాత మరే తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. హిందీ, తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. కాగా, రెట్రో ప్రమోషన్ల కోసం హాజరైన పూజా హెగ్డేకు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‍లో ఏ హీరోతో సి...