భారతదేశం, జూన్ 21 -- ధనుష్, నాగర్జున, రష్మిక మందన్న మరియు ఇతరులు నటించిన తెలుగు-తమిళ చిత్రం కుబేర శుక్రవారం (జూన్ 20) థియేటర్లలో విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. బాక్స్ ఆఫీస్ వసూళ్లు మొదటి రోజు నుంచి బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం (జూన్ 21) కుబేర మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ నాగార్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

శనివారం జరిగిన కుబేర చిత్ర విజయోత్సవ సభలో, చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన నాగార్జున తన పాత్ర చిత్రంలో ప్రధాన పాత్ర అని, కథ అంతా తన చుట్టూ తిరుగుతుందని చెప్పారు.

"ఈ చిత్రంలో నేనే ప్రధాన పాత్రని. మిగతావన్నీ నా చుట్టూ తిరుగుతాయి. నాకు దక్కిన స్క్రీన్ స్పేస్ వేరేగా ఉండవచ్చు. కానీ అది నాకు ప్రమాణం కాదు. మొదటి నుంచి చివరి వరక...