Hyderabad, జూన్ 20 -- సరికొత్త పాత్రలో హీరో నాగార్జున అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమా కుబేర. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీలో నాగార్జునతోపాటు తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు.

ఇవాళ (జూన్ 20) థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నాగార్జున ఇంట్రెస్టింగ్‌ సినీ విశేషాలను పంచుకున్నారు.

-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు (ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.

-శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ మూవీ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించ...