భారతదేశం, డిసెంబర్ 4 -- అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టి నటి శోభిత ధూళిపాళ్ల ఏడాది పూర్తి చేసుకుంది. సరిగ్గా ఏడాది కిందట అంటే డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శోభిత.. చైతన్యతో గడిపిన ఏడాది ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఒక కవితాత్మక క్యాప్షన్ తో వీడియోను అభిమానులతో పంచుకుంది.

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గతేడాది డిసెంబర్ 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. తొలి పెళ్లి రోజు సందర్భంగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన వీడియోను షేర్ చేస్తూ శోభిత ఇలా రాసుకొచ్చింది. "గాలి ఎప్పుడూ ఇంటి వైపే వీస్తుంది. నా భర్తతో కలిసి సూర్యుని చుట్టూ ఒక అద్భుతమైన ప్రదక్షిణ (ఏడాది కాలం) పూర్తి చేశాను. అగ్నితో పునీతమైనట్లుగా.. ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. మ...