భారతదేశం, నవంబర్ 4 -- నాగ చైతన్య మరో భారీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. కార్తీక్ దండు డైరెక్షన్ లో అడ్వెంచర్ మైథాలిజీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నాగ చైతన్యతో కలిసి మీనాక్షి చౌదరి అడ్వెంచర్ చేయబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో మీనాక్షి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది.

నాగ చైతన్య- మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఎన్‌సీ 24 (వర్కింగ్ టైటిల్) నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లుక్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో మీనాక్షి పురావస్తు శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి మెరవబోతోంది. దక్ష అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది.

ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు మీనా...