భారతదేశం, మార్చి 18 -- నాగ్ పూర్‌లో కర్ఫ్యూ విధించారు. ఒక మత పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణ, 17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్లు వంటి రెండు కీలక అంశాల చుట్టూ వదంతులు, ఉద్రిక్తతలు కలగలిపి సోమవారం అర్ధరాత్రి సెంట్రల్ నాగ్ పూర్ లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోళన సమయంలో ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని కాల్చివేశారనే వదంతులు వ్యాపించాయి. ఒక వర్గపు ప్రదర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మరోవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

మహారాష్ట్ర పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం ఔరంగబాద్ (ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్)లోని ఖుల్తాబాద్‌లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్‌ నేపథ్యంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 ప్రకారం నాగ్‌పూర్ నగరంల...