Telangana, జూన్ 11 -- రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. మాల్ సమీపంలోని తమ్మలోనిగూడ గేట్ ఓ కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా. మరో ముగ్గురు గాయపడ్డారు. సాయి తేజ, పవన్ కుమార్, రాఘవేంద లను మృతులుగా గుర్తించారు.

హైదరాబాద్ లో ఉంటున్న ఆరుగురు స్నేహితులు వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ్నుంచి తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా. వీరి కారు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా మహబూబ్ నగర్ కు చెందిన వాళ్లు కాగా. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది....