Telangana,nagarjuna sagar, జూలై 9 -- ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో జూరాలా, శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.

గతేడాదితో పోల్చితే ఈసారి నెల రోజుల ముందుగానే వరద ప్రవాహం మొదలైంది. తాజాగా శ్రీశైలం గేట్లు ఎత్తటంతో.. ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 1,05,764 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 9,334 క్యూసెక్కులుగా నమోదైంది.

ఇవాళ్టి ఉదయం(జూలై 9) రిపోర్ట్ ప్రకారం. నాగార్జున సాగర్‌ మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 534.50 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 177.06 టీఎంసీలు ఉంది. నెలాఖరు నాటికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికా...