Hyderabad, ఆగస్టు 4 -- రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఇందులో మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సైమన్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే మొదట ఆ పాత్ర తాను చేయాలని అనుకున్నట్లు రజనీకాంత్ తాజాగా వెల్లడించాడు. అంతేకాదు నాగార్జునతో కలిసి పని చేయడం, అతని అందం వెనుక రహస్యం గురించి కూడా మాట్లాడాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కూలీ మూవీపై మాట్లాడిన వీడియోను సన్ పిక్చర్స్ సోమవారం (ఆగస్ట్ 4) తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రజనీ తెలుగులో మాట్లాడటం విశేషం. ఈ సందర్భంగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న కూలీ మూవీలో నాగార్జున పోషిస్తున్న సైమన్ అనే విలన్ పాత్రపై స్పందించాడు. ఆ పాత్ర గురించి వినగానే తానే ఆ విలన్ రోల్ పోషించాలని అనుకున్నట్లు రజనీ చెప్పాడు. ఇదే విషయాన్ని ...