Hyderabad, జూన్ 23 -- కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్న కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఇది నా సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ల మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది" అని అన్నారు.

"ఇక్కడకి నేను గెస్ట్‌గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జున గారు ఈ సినిమాకు ముందు ఒకసారి ...