భారతదేశం, ఆగస్టు 29 -- 'మ్యాన్ విత్ ద గోల్డెన్ హార్ట్'గా అభిమానులు పిలుచుకునే అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వయసు 60 దాటినా, ఇప్పటికీ 30 ఏళ్ల యువకుడిలా కనిపించే నాగార్జున ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. తన ఫిట్‌నెస్ రహస్యాలను ఆయన గతంలో హిందూస్థాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను గత 30-35 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నానని నాగార్జున తెలిపారు.

నాగార్జున వర్కవుట్ రొటీన్‌లో కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ ఉంటాయట. వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కవుట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తారట. ఉదయం 45 నిమిషాల నుంచి గంటపాటు చాలా ఇంటెన్స్‌గా వర్కవుట్ చేస్తానని చెప్పారు.

"నేను కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండూ చేస్తాను. గత 30-35 సంవత్...