Hyderabad, ఆగస్టు 11 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలుసు కదా. అంతకంటే ముందు ఈ సీజన్ లో తొలిసారి అగ్నిపరీక్ష పేరుతో 40 మంది సామాన్యుల నుంచి ముగ్గురిని ఎంపిక చేయబోతున్నారు. ఇది ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా రానున్న నాగార్జున.. రెమ్యునరేషన్ రూపంలో ఏకంగా రూ.30 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం.

వరుసగా బిగ్ బాస్ తెలుగు సీజన్లకు హోస్ట్ గా ఉంటూ వస్తున్నాడు అక్కినేని నాగార్జున. అలాగే ఈ సీజన్ కు కూడా అతడే ఫైనల్ అయ్యాడు. నిజానికి అతడు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో బాలకృష్ణను ఈసారి హోస్ట్ గా తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరికి రూ.30 కోట్ల డీల్ మాట్లాడి నాగార్జుననే ఫైనల్ చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

ఇది గతేడాది కంటే రూ.10 కోట్లు ఎక్కువ కావడం ...