Hyderabad, ఏప్రిల్ 27 -- తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ అమితమైన అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలు తెలుగులో సైతం రిలీజ్ అవుతుంటాయి. కోలీవుడ్ అగ్ర కథానాయుకుడు సూర్య నటించిన లేటెస్ట్ మూవీనే రెట్రో. బుట్టబొమ్మ పూజా హెగ్డే రెట్రోలో హీరోయిన్‌గా చేసింది.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో మూవీని సూర్య, జ్యోతిక సొంత బ్యానర్ అయిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు. మే 1న రెట్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో సూర్య మాట్లాడుతూ, "ముందుగా పహల్గామ్ బాధితులకు నివాళులు. రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది....