Andhrapradesh, సెప్టెంబర్ 5 -- నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత ఘోరం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (ప్రకాశం జిల్లా) కు చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు. సమాచారం ఇవ్వటంతో ఈ దారుణం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో కలహాల నేపథ్యంలో ఆగస్ట్ 30వ తేదీన కుమార్తెలు, కుమారుడిని తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు. అక్కడ్నుంచి అదేరోజు రాత్రి పిల్లలను తీసుకుని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌కు వెళ్లాడు.

మరునాడు సూర్యతండా సమీ...