భారతదేశం, నవంబర్ 23 -- నాగ చైతన్య అప్ కమింగ్ మైథలాజికల్ థ్రిల్లర్ టైటిల్ రివీలైంది. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఇవాళ (నవంబర్ 23) ఈ సినిమా పేరును అనౌన్స్ చేశారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వృషకర్మ అనే పేరు పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ లో చైతన్య ఫస్ట్ లుక్ తో పాటు మూవీ టైటిల్ ను ప్రకటించాడు.

నాగ చైతన్య పుట్టినరోజున ఆయన తదుపరి చిత్రం 'వృషకర్మ' ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేసిడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా ఆదివారం ఇలా ట్వీట్ చేశాడు. "మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చైతన్య. వృషకర్మ సాలిడ్ గా కనిపిస్తోంది. దీని కోసం ఎదురుచూస్తున్నా'' అని మహేష్ ఎక్స్ లో పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ లో చైతన్య చేతిలో ఇనుప రాడ్ తో యాక్షన్ మోడ్ లో కనిపించాడు. ఈ లుక్ అదిరిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

"ఈ గౌరవా...