భారతదేశం, ఏప్రిల్ 18 -- నాగ చైతన్య కొత్త మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ టైటిల్ మాత్రం కన్ఫార్మ్ అయినట్లు టాక్. నాగ చైతన్య నటిస్తున్న 24వ మూవీకి 'వృష‌క‌ర్మ‌' అనే టైటిల్ ను ఓకే చేసినట్లు తెలిసింది. అలాగే ఈ మూవీలో చై సరసన మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేయనుంది.

ఇటీవల తండేల్ మూవీ విజయంతో నాగ చైతన్య జోష్ మీదున్నారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చై తర్వాతి సినిమా కోసం సిద్ధమయ్యారు. కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మైథలాజికల్ (మిథికల్) థ్రిల్లర్ కోసం చై తన లుక్ ఛేంజ్ చేశారు. ఈ మూవీకి 'వృష‌క‌ర్మ‌' అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ముందు నుంచే...