Hyderabad, మే 15 -- అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో యాక్ట్ చేసి నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పరంపర, ఇన్‌స్పెక్టర్ రిషి వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు.

ఇటీవలే 28 డిగ్రీ సెల్సియస్ సినిమాతో అలరించిన హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరించిన ఈ సినిమాకు కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు.

లెవెన్ సినిమా మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో లెవెన్‌కు సంబంధించి ఇంట...