భారతదేశం, నవంబర్ 10 -- తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. 7 పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో అంటూ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేంద్ర రవి, నటి యామిని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. "'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చింది. నాకు శ్రీకాకుళం యాస తెలీదు. కానీ రాహుల్ అన...