Hyderabad, ఆగస్టు 7 -- విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన రీసెంట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా కింగ్డమ్. మళ్లీ రావా, జెర్సీ సినిమాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

-ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్‌కి అంత మంచి స్పందన వస్తోంది.

-విజయ్ దేవరకొండ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత జైల్లో మా ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉన్నా.. పైకి మాత్రం అది పూర్తిగా చూపించకూడదు. ఎందుకంటే తమ...