Hyderabad, జూన్ 22 -- హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన సినిమా 'కన్నప్ప'. బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. ఈ సందర్భంగా జూన్ 21న హైదరాబాద్‌లో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మంచు విష్ణు ప్రతి ఒక్కరి గురించి గొప్పగా చెప్పాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ .. "కన్నప్ప విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. కన్నప్ప అనేది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు" అని అన్నాడు.

"2017లో స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కన్నప్పని ఎప్పుడు చేస్తాను.. ఎలా చేస్తాను అన్నది చెప్పలేను.. కానీ, ఎప్పుడు చేసినా కూడా మీరే మ్యూజిక్ ఇవ్వాలని స్టీఫెన్ గారికి అప...