భారతదేశం, అక్టోబర్ 30 -- టాలీవుడ్‌లో దృష్టి, వివాహ భోజనంబు సినిమాలతో మోస్తరుగా.. సామజవరగమన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు. అయితే, యంగ్ హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు రామ్ అబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు టాలీవుడ్ డైరెక్టర్స్ కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ కూడా గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్బంగా రామ్ అబ్బరాజు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ .. "'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. కానీ, ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశ...