Hyderabad, ఏప్రిల్ 24 -- ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీ తన పాకిస్థాన్ సంబంధాల ఆరోపణలపై స్పందించింది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీ.. పాకిస్థాన్ సంబంధాలపై సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఆమెకు మన సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. దీనిపై ఇమాన్వీ స్పందించింది.

ఇమాన్వీ గురువారం (ఏప్రిల్ 24) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఈ దాడి జరిగినప్పటి నుంచీ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వివరణ ఇచ్చింది. "మొదటగా పహల్గామ్ లో జరిగిన దాడిలో మరణించిన వారికి నా హృదయపూర్వక నివాళులు.

నా ఆలోచనలన్నీ వాళ్ల గురించే. ఏ అమాయక ప్రాణం పోయినా నా గుండె తరుక్కుపోతుంది. ఈ హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి రోజూ కళ ద్వారా ప్రేమను ...