Hyderabad, జూన్ 17 -- ప్రేమమ్ మూవీ ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటి అనుపమ పరమేశ్వరన్. గతేడాది టిల్లూ స్క్వేర్ లోనూ రెచ్చిపోయి నటించింది. తన సొంత ఇండస్ట్రీ మలయాళం కంటే తెలుగు ప్రేక్షకులకే ఎక్కువగా దగ్గరైంది. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడామె సురేష్ గోపీ మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ద్వారా మళ్లీ మలయాళంలోకి వెళ్తోంది. ఈ సందర్భంగా అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ ఆడియో లాంచ్ సోమవారం (జూన్ 16) కొచ్చిలో జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కొందరి విమర్శల వల్లే తాను ఇప్పుడు తనను ఉత్తేజితం చేసే మూవీస్ ఎంచుకునేలా చేసిందని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. "నేను నటించలేను అని ఎంతో మంది నన్ను ట్రోల్ చేశారు.

అలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఈ సినిమా డైరెక్టర్ (ప్రవీణ్ నారాయణన్) నాకు లీడ్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాకు ఓ ...