Hyderabad, జూన్ 26 -- టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అయితే, ఇటీవల నిర్వహించిన కుబేర సక్సెస్ మీట్‌లో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం. మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. విక్రమ్ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు" అని అన్నారు.

"అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా కావచ్చ...