Hyderabad, సెప్టెంబర్ 8 -- కాజల్ అగర్వాల్ కు ప్రమాదం జరిగింది.. ఆమె ప్రాణాలతో పోరాడుతోందంటూ వచ్చిన వార్తలు ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. కానీ దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని సోమవారం (సెప్టెంబర్ 8) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఇలాంటివి నమ్మొద్దని స్పష్టం చేసింది.

టాలీవుడ్ చందమామగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్. ఆమె పెళ్లి తర్వాత అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నా.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అలాంటి నటికి యాక్సిడెంట్ జరిగిందని, ప్రాణాలతో పోరాడుతోందన్న వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. దీంతో కాజల్ వెంటనే తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించింది. అవన్నీ నిరాధార వార్తలు, ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.

"నాకు ప్రమాదం జరిగిందని, ఇక నేను లేను అంటూ ఓ నిరాధార వార్త వచ్చినట్లు నాకు తెలిసింద...