Hyderabad, జూలై 23 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీ గురువారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే బుధవారం (జులై 23) విశాఖపట్నంలో మరోసారి ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్.. వైజాగ్ తో తన అనుబంధం, ప్రత్యర్థుల ట్రోలింగ్ కు సమాధానం ఇవ్వడంతోపాటు తన సినీ నేపథ్యం గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడాడు.

హరి హర వీర మల్లు ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ స్పీచ్ వైరల్ అవుతోంది. అతడు తన సినిమాలను పెద్దగా ప్రమోట్ చేయకపోవడంపై స్పందిస్తూ.. తనకు ఇవ్వడమే తప్ప అడగడం రాదని అనడం గమనార్హం. "నా సినిమా చూడండి అని అడగడానికి నాకు సిగ్గనిపిస్తుంది.

మొదటి సినిమా నుంచీ పబ్లిసిటీ లేకుండా చేసుకుంటూ వెళ్లడం అలవాటైంది. ఏదో ఆడియో రిలీజ్ ఈవెంట్లకు రావడం తప్ప ప్రత్యేకంగా నా సినిమాను ప్రమోట్ చేయలేదు. న...